- నాదర్గుల్ భూములను కాపాడాలి.!
- రైతులతో కలిసి భూముల్లోకి ప్రవేశించిన విశారాధన్
- భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదు
- రైతుల భూములు రైతులకే చెందాలి
- ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నాదర్గుల్ గ్రామానికి చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని విశారదన్ హెచ్చరించారు. వివాదాస్పదంగా మారిన నాదర్గుల్ ప్రభుత్వ భూముల్లోకి రైతులతో కలిసి ప్రవేశించిన ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, నాదర్గుల్ గ్రామంలో 613 సర్వేనెంబర్ గల 370 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతుల నుండి బలవంతంగా తీసుకున్న కొంతమంది భూ కబ్జాదారులు, రైతులను తమ భూములలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మారిన ఈ భూముల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా నాదర్గుల్ భూములను పరిశీలించడానికి ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజు, ఈ భూముల్లోకి రైతులతో కలిసి ప్రవేశించి పరిశీలించి, బడుగు బలహీన వర్గాల రైతులకు చెందిన ఈ భూములను, ప్రభుత్వ అండదండలతో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెందిన కొంతమంది పెద్దలు కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని విశారదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను భూముల్లోకి రానివ్వకుండా చుట్టుముట్టు ఇనుప రేకులతో ఫెన్సింగ్ చేసి బౌసర్లను పెట్టి, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతుల పట్ల అండగా ఉండాల్సిన ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని ఆయన ఆరోపించారు.
బాధిత రైతులకు అండగా ఉండాల్సిన పోలీసులు కూడా వారి పట్ల కర్కాశంగా వ్యవహరిస్తున్నారని విశారదన్ మహారాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాదర్గుల్ కు చెందిన రైతుల భూముల్లోకి వేరే వ్యక్తులు ప్రవేశించి వాళ్ల భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.








