Mahaa Daily Exclusive

  వారసత్వం కంటే వ్యక్తిత్వమే ముఖ్యం..: రామ్ చరణ్..

Share

  • పిల్లలు చూసి నేర్చుకోవాలి.. అదే నా పద్ధతి.
  •  రామ్ చరణ్

హైదరాబాద్, మహా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణను, విలువలను తన పిల్లలకు కూడా అందించాలనుకుంటున్నారు. పిల్లలను కేవలం సంపన్న కుటుంబంలో పుట్టిన ‘రిచ్ కిడ్స్’గా మాత్రమే కాకుండా, సమాజంలో స్వతంత్రంగా ఎదిగేలా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పిల్లల పట్ల తాను కొంత కఠినంగా, అంటే ‘రఫ్ డాడీ’గా ఉండటానికి ఇష్టపడతానని చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపాదన, సౌకర్యాల కంటే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ముఖ్యమని ఆయన భావిస్తున్నారు.

పిల్లల వ్యక్తిత్వ వికాసంపై స్పందిస్తూ, పిల్లలు కేవలం మాటల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించడం ద్వారానే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా తన తండ్రిని చూసే క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధతను నేర్చుకున్నానని, తన పిల్లలు కూడా అదే బాటలో పయనించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విలాసవంతమైన జీవితం కంటే కష్టపడే తత్వాన్ని వారికి అలవాటు చేయడమే తండ్రిగా తన బాధ్యత అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. చరణ్ వ్యక్తం చేసిన ఈ భావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆయన పెంపకశైలిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest