Mahaa Daily Exclusive

  మహిళ మావోయిస్టులు అరుణ,స్వరూపల జాడ ఏది..?

Share

  • ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
  • తమ వద్ద సమాచారం లేదంటున్న పోలీసులు
  • రంగబోయిన భాగ్య మృతితో అలుముకున్న విషాదఛాయలు

 

నాడు పెద్ద శంకర్ నేడు రంగబోయిన భాగ్య ఉమ్మడి మెదక్ జిల్లాలో చివరి ఎన్కౌంటర్ రా?

 

హైదరాబాద్, మహా :

ఛత్తీస్‌గఢ్‌లోని మాచపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య సోమవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌ లో పార్థాపూర్ ఏరియా మహిళా కమాండర్ ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య మృతి చెందినట్లు పోలీస్ అధికారులు నిర్ధారించారు. రూపి అలియాస్ భాగ్య స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంగా గుర్తించారు.

 

అరుణ, స్వరూప జాడ ఏది?

 

సిద్దిపేట జిల్లా నుంచి ముగ్గురు మహిళ మావోయిస్టులు ఉండగా.. అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్ రూపి చత్తీస్ ఘడ్ మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే? మరి మహిళ మావోయిస్టులు అరుణ, స్వరూపల జాడ ఎక్కడ వారు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది.

 

అక్కన్నపేటకు చెందిన కాశ బోయిన స్వరూప, నంగు నూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియ రావడం లేదు పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు. వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా లేక ఎక్కడన్నా తల దాచుకున్నారా? లేక పోలీసులకు లొంగిపోయా రా? ఒకవేళ పోలీసులకు లొంగిపోతే జీవనం ఎక్కడ గడుపుతున్నారు. లేదా భారీ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారా? అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి, వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య ఛత్తీస్గడ్ రాష్ట్రం కక్కం కేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడంతో సిద్దిపేట జిల్లా ధర్మారంలో విషాదఛాయలు అదుముకున్నాయి రంగబోయిన భాగ్య మృతదేహాన్ని ధర్మారంకు అర్ధరాత్రి వరకు చేరుకుంటుందని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు ఇంతవరకు అచూకి లేని మహిళా మావోయిస్టుల కోసం తల్లిదండ్రులు చూడడానికి ఆరాటపడుతున్నారు మీరు చనిపోయారా లేక ఉద్యమంలో ఉన్నారా అనేది అర్థం కావడం లేదు సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ విప్లవ ఉద్యమం ప్రారంభమైన తొలి రోజుల్లోనే పెద్ది శంకరును తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో సిరంచ లో పట్టుకొని తొలి ఎన్కౌంటర్ లో పెద్దిశంకర్ మృతి చెందాడు నేడు ఉమ్మడి మెదక్ జిల్లా కు చెందిన రంగ బోయిన భాగ్య ఎన్కౌంటర్ చివరి ఎన్కౌంటర్ గా భావిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా కు చెందిన స్వరూప అరుణ జాడలు తెలియక అటు కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నారు రంగబోయిన భాగ్య వికలాంగురాలు అయినప్పటికీ ఆపరేషన్ కగార్ ముగిసి 12 రోజులకే ఎన్కౌంటర్లో చనిపోవడం అందరిని కలవరం పరిస్థితి సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం లొంగిపోయినప్పటికీ సాయిధ పోరాటమే నా మార్గమని ప్రకటించుకుంది ప్రకటించుకున్న రెండు నెలలు పూర్తవకముందే రూపి ఆలేష్ భాగ్య చనిపోవడం మారింది నేడు 11 గంటలకు ధర్మారం గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయి ఈ అంతక్రియలకు ఆ ప్రజా సంఘాల నేతలు విరసం నేతలు పారాకుల సంఘాల నేతలు హాజరు కానున్నట్లు తెలిసింది

Latest