Mahaa Daily Exclusive

  ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలిగా ప్రొఫెసర్ నీరజ ఎంపిక

Share

*ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ప్రొఫెసర్ నీరజ*

చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులుగా సిటీ కళాశాల ఐక్యూయేసి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జె.నీరజ ఎంపికయ్యారు.

నీరజ సిటీ కళాశాల తెలుగు శాఖ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. సిటీ కళాశాలకు దేశంలోనే అత్యున్నతంగా A++గ్రేడ్ సాధించటంలో ప్రొఫెసర్ నీరజ కీలక పాత్ర పోషించారు. కళాశాల విద్యాశాఖలో అకడమిక్ ఆఫీసర్ గా కూడా ప్రొఫెసర్ నీరజ విశేషమైన సేవలందించి ఉన్నతాధికారుల, అధ్యాపకుల ప్రశంసలందుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి దోహదపడే అనేక విద్యావిషయక ప్రణాళికలను రూపొందించటంలో, డిగ్రీ కళాశాల అభివృద్ధి విధానాల రూపకల్పనలో అకడమిక్ ఆఫీసర్ గా ఎంతో నిబద్ధతతో అంకిత భావంతో నీరజ కృషి చేశారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను, సమకాలీన అవసరాలను దృష్టిలో ఉంచుకొని సృజనాత్మక బోధనా నైపుణ్యంతో అధ్యాపకురాలిగా కూడా నీరజ బృహత్తరమైన పాత్ర పోషించారు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం వారి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం కూడా నీరజ అందుకున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, అంబేద్కర్ విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళిక సభ్యులుగా వ్యవహరించారు. విమర్శకురాలిగా, పరిశోధకురాలిగా అనేక పరిశోధన పత్రాలను ప్రచురించారు. సంపాదకురాలిగా, అనువాదకురాలిగా మరెన్నో విలువైన గ్రంథాలను వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన జాతీయ అంతర్జాతీయ సదస్సులో 30కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు.
సంచాలకులుగా ప్రతిష్టాత్మకమైన జాతీయ సదస్సులు నిర్వహించారు.
విశేషమైన బోధనానుభవంతో పాటు సమర్ధవంతమైన పాలనానుభవం ఉన్న ప్రొఫెసర్ నీరజ పాలక మండలిసభ్యులుగా ఎంపిక కావటం పట్ల సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రసాద్ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Latest