Mahaa Daily Exclusive

  అవగాహనతోనే వడదెబ్బకు చెక్: ప్రజలకు డాక్టర్ ఎం. రాజీవ్ కీలక సూచనలు.

Share

*డా. ఎం. రాజీవ్*, MBBS, MD
*రాష్ట్ర చైర్మన్*
డాక్టర్ సెల్ , మెడికల్ & హెల్త్ విభాగం – టీపీసీసీ

*అవగాహనతోనే వడదెబ్బ నివారణ సాధ్యం* : *డాక్టర్ రాజీవ్*

*వడదెబ్బ (Sun Stroke) –లక్షణాలు, జాగ్రత్తలు & చికిత్స*

*వడదెబ్బ లక్షణాలు:*
అధిక జ్వరం (104°F పైగా)
తల తిరగడం, తలనొప్పి
బలహీనత, అలసట
వికారం, వాంతులు
చర్మం ఎర్రబడటం, వేడెక్కడం
స్పృహ తప్పడం
మూర్ఛ (Seizures)

*వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:*

*సమయం:*
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లడం తగ్గించండి.

*నీటి శాతం:*
దాహం వేయకపోయినా ప్రతి గంటకు నీరు, ఓఆర్ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు, లేదా నిమ్మరసం తాగాలి.

*దుస్తులు:*
తేలికపాటి, వదులుగా ఉండే కాటన్ (నూలు) దుస్తులు ధరించండి. రంగులేత దుస్తులు మంచివి.

*రక్షణ:*
బయటకు వెళ్తే తప్పనిసరిగా గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్ లేదా టవల్ వంటివి తలకు రక్షణగా వాడాలి.

*ఆహారం:*
కారం, మసాలా, వేపుళ్లు తగ్గించి, దోసకాయ, టమాటా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

*ప్రయాణం:*
ఎండలో ఎక్కువ సేపు ప్రయాణాలు చేయకండి. వాహనాల్లో వెళ్తే తగినన్ని నీళ్లు వెంట ఉంచుకోండి.

*పిల్లలు/వృద్ధులు:*
చిన్న పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారు ఎండలో అసలు తిరగకూడదు, వారిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

*వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స (First Aid):*
బాధితుడిని వెంటనే నీడలో లేదా ఫ్యాన్, ఏసీ ఉన్న చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి
చల్లని నీటితో శరీరాన్ని తడపాలి లేదా తడి గుడ్డతో ఒళ్లు తుడవాలి
స్పృహలో ఉంటే చల్లటి మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ద్రావణం తాగించాలి
పరిస్థితి విషమిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలి

Latest