*ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి*
*హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి*
*ప్రజావాణి కార్యక్రమానికి 129 అర్జీలు*
హనుమకొండ మహా ;
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దారులతో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, అదనపు జిల్లా కలెక్టర్ ఎన్. రవి వినతులను స్వీకరించారు. ప్రజలు వినతులను అందిస్తూ సమస్య గురించి కలెక్టర్, అదనపు కలెక్టర్లకు తెలియజేయగా వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, గృహనిర్మాణ, మున్సిపల్, తదితర శాఖలకు సంబంధించి 129 అర్జీలు కలెక్టర్, అదనపు కలెక్టర్లకు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా వడగాలుల బారిన పడకుండా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పక్షులు పశుసంపదకు కూడా నీటి వనరులు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ పరకాల ఆర్డిఓ లు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, జడ్పీ సీఈవో శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.








