- 200 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా…!
- 626/2, సర్వే నెంబర్లో హైడ్రా పరిరక్షణలో 9.5 ఎకరాల కంచె భూమి!
- ఈ భూమిలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు హైడ్రా…!
రాజేంద్రనగర్ మహా:
శంషాబాద్ రెవెన్యూ 200 కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారు. స్థానికులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని ఎయిర్పోర్ట్ కాలనీ (కంచే పోరంబోకు) ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 626/2 లో, 200 కోట్లు విలువచేసే 9.5 ఎకరాల గైరాన్ భూమిని కొంతమంది ఆక్రమించుకొని లేఅవుట్ వేసి ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయంటూ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రాధికారులు, భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను జెసిబి సాయంతో కూల్చివేతలు చేపట్టారు. కంచే భూమి హైడ్రా పరిరక్షణలో ఉంటుందంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ యొక్క భూమిలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హైడ్రా రెవెన్యూ హెచ్చరించారు.








