- ఆర్టీసీ సమ్మె
- మెట్రో కీలక నిర్ణయం
- ప్రతి నాలుగు నిమిషాలకు ఒక రైలు
- ఎంఎంటీఎస్ రైళ్ళను పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మహా : ఆర్టీసీ సమ్మె ప్రభావం హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఉంది. దీంతో మెట్రో ప్రయాణీకుల కోసం కీలక ప్రకటన చేసింది. మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మె ముగిసేవరకూ 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రో తాజా ప్రకటనతో తాజా నిర్ణయం మేరకు మియాపూర్- ఎల్.బి.నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, అలాగే నాగోల్- రాయదుర్గం కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాతా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఎంఎంటీఎస్ సర్వీసు లను పెంచాలని ప్రభుత్వం రైల్వే అధికారులను కోరింది. మెట్రో రైళ్లన్నీ ఉదయం నుంచి పూర్తి రద్దీగా మారాయి. అటు ప్రయివేటు వాహనాలు ఇష్టానుసారం దోచుకుంటున్నాయి. దీంతో.. మెట్రో తాజా నిర్ణయం కొంత మేర రిలీఫ్ గా మారనుంది. అయితే.. ఆర్టీసీ బస్సుల సమ్మె కారణంగా మహిళా ప్రయాణీకులకు ఉచిత ప్రయాణం నిలిచిపోయింది. అదనపు ఛార్జీలతో గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.








