హైదరాబాద్, మహా : రాష్ట్రంలో 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) హోదా కల్పిస్తూ పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1995 సంవత్సరం బ్యాచ్ కు చెందిన వీవీ వెంకట శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ మురళీధర్ భగవత్ లతో పాటు 1996 బ్యాచ్ కు చెందిన చారు సిన్హా, డాక్టర్ అనిల్ కుమార్, వి.సి. సజ్జనార్ లు ఉన్నారు. పదోన్నతి పొందిన అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 5








