* విశాఖ-
* *గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ప్రసంగించిన గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే*
* గూగుల్ ఇండియా ఏఐ హబ్ కు ఇవాళ చేసిన శంకుస్థాపన 2047 వికసిత్ భారత్ కు ఓ పునాది రాయి లాంటిది
* ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తు్న ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుంది.
* భారత డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ లోనూ ఈ డేటా సెంటర్ అత్యంత ముఖ్యమైన అంశం
* గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది
* ఇంటర్నేషనల్ సబ్ సీ గేట్ వే గా ఉన్న ముంబై , చెన్నైలతో పాటు విశాఖ కూడా ఇప్పుడు కీలకంగా మారింది
* కొత్త ఫైబర్ ఆప్టిక్ లైన్లు ఇతర ప్రాంతాలతో విశాఖను అనుసంధానం చేస్తాయి
* సముద్ర గర్భ లైన్లతో సంప్రదాయ నౌకాయాన మార్గాలు ఇక డిజిటల్ ట్రేడ్ రూట్లుగా మారతాయి
* అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా లు ఈ డేటా సెంటర్ ఏర్పాటులో భాగస్వామ్యం వహిస్తున్నందుకు ధన్యవాదాలు
* ఇండస్ట్రియల్ కారిడార్ గా ఎదుగుతున్న ఈ ప్రాంతానికి టెక్ ఫ్యూచర్ ను అందించేలా ఈ డేటా సెంటర్ ఉంటుంది
* స్థానిక యువతకు ఉద్యోగ భద్రత, ఇంధన భద్రత, నీటి వినియోగం లాంటి అంశాలతో స్థానిక భాగస్వామ్యంతో ముందుకు అడుగులు వేస్తాం
* యువతకు భవితను అందించేలా వారికి అడ్వాన్స్ డ్ క్లౌడ్, ఏఐలో శిక్షణ కార్యక్రమాలు కూడా గూగుల్ నిర్వహిస్తుంది
* 10 వేల మందికి పైగా మహిళలకు మైక్రో ఎంట్రప్రైజ్ గా మారేందుకు కూడా సహకారం అందిస్తుంది
* న్యూ ట్రాన్స్ మిషన్ లైన్లు, ఎనర్జీ స్టోరేజి సిస్టమ్స్ లాంటివి ఈ ప్రాంతానికి ఇంధన భద్రతను కల్పిస్తాయి
* విశాఖలోని వివిధ నివాస ప్రాంతాలు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ ప్రాంతానికి ఆర్ధిక స్థిరత్వం కల్పించేలా ఈ డేటా సెంటర్ నిర్మితం అవుతుంది
* బికాస్ కోలే,
గూగుల్ ఇన్ఫ్రా గ్లోబల్, క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్








