Mahaa Daily Exclusive

  భారత్ మీడియాపాయింట్ ఆధ్వర్యంలో….. జూన్ 2న “తెలంగాణ రైజింగ్ అవార్డ్స్ – 2026”

Share

హైదరాబాద్, మహా :
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం దాటుతున్న వేళ, రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న ధీశాలురను గౌరవించుకునేందుకు భారత్ మీడియా పాయింట్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ అవార్డ్స్ – 2026” వేడుకను జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2014 నుండి 2026 వరకు రాష్ట్ర పునర్నిర్మాణ తొలి దశలో, తెలంగాణ అభివృద్ధికి గట్టి పునాది వేసిన వ్యక్తులు, సంస్థలు మరియు వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన నాయకత్వాన్ని ఈ వేదికపై సత్కరించనున్నారు. కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా, రాష్ట్రం పట్ల ఉన్న నిబద్ధతను, మేధస్సును గుర్తించే బాధ్యతాయుతమైన వేడుకగా దీనిని రూపొందించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవడం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అమరవీరుల కుటుంబాలను గౌరవించడం ఈ వేదికపై అత్యంత ఉద్వేగభరితమైన మరియు గౌరవప్రదమైన ఘట్టం కానుందని నిర్వాహకులు తెలిపారు. భారత్ మీడియా పాయింట్ సమర్పణలో జరగనున్న ఈ మహత్తర వేడుక, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సరికొత్త శోభను తీసుకురానుందని తెలిపారు.
………

Latest