Mahaa Daily Exclusive

  కోయి కోటేశ్వర రావు కి మద్దూరి నగేష్ బాబు జాతీయ కవితా పురస్కారం..

Share

 

ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య కోయి కోటేశ్వరరావు మద్దూరి నగేష్ బాబు జాతీయ పురస్కారానికి ఎంపికైనట్లు పి శ్రీనివాస్ గౌడ్ నేడు ఒక ప్రకటనలో తెలియజేశాడు. ఈ పురస్కారానికి రెండు రాష్ట్రాలనుండి 75 కవితాసంపుటులు రాగా వాటిని పరిశీలించిన న్యాయ నిర్ణేతలు కోయి కోటేశ్వర రావు ‘నాగ స్వరం ‘ కవితా సంపుటి ని ప్రదాన పురస్కారికి ఎంపిక చేసినట్లు శ్రీనివాస గౌడ్ తెలియజేశాడు. ఈ పురస్కారం కింద పదిహేను వేల(15000) నగదు బహుమతి , జ్ఞాపిక తో పాటు కోటేశ్వరరావుని సత్కరించ నున్నట్లు ఆయన తెలిపారు. మే 23 సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో బహుమతి ప్రదాన సభ జరుగుతుంది.