గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ కు ప్రధాన మంత్రి మోదీ వస్తె తెలంగాణ కు లాభం జరుగుతుందని ప్రజలంతా భావించారు
ప్రధాన మంత్రి వస్తె ఎయిర్పోర్ట్ కి పోయి గౌరవ ప్రదంగా స్వాగతం పలికాం..అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు..
ప్రధాన మంత్రి వచ్చి పెట్రోల్ డీజిల్ వాడవద్దు..బంగారం కొనవద్దు , వంట నూనె వాడవద్దు అంటున్నారు..
ఒక ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరైందా.. మీరు పాటించారా..
వేలాది కార్ల తో ప్రధాని ఈరోజు రోడ్ షో చేశారు..
దేశంలో మంచి పరిపాలన అందిస్తున్నామని చెప్పి ప్రజల మీద భారం వేస్తున్నారు..
ప్రజలకు బరోసా కల్పించాల్సింది పోయి భయబ్రాంతులకు గురి చేశారు..
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా,బండి సంజయ్,కిషన్ రెడ్డి గారు కాళేశ్వరం లో అవినీతి జరిగింది..brs ఎటిఎం గా వాడుకుంటుంది సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు..
తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎందుకు చేయడం లేదు..
తెలంగాణ కు 12 ఏళ్లలో ఏం చేశారో చెప్పి కోట్లాడండీ ..
తెలంగాణ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన
సికింద్రాబాద్ టవర్ సర్కిల్ లో మీరు ఇచ్చిన నిధులకు కేంద్ర ప్రభుత్వ వాట..రాష్ట్ర వాట ఎంత చర్చకు సిద్ధమా…?
29 రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో మాకు ఇచ్చారు.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఏం ఇచ్చారు..
మౌలిక సదుపాయాలు కావాలి..కేంద్రీయ సంస్థలు కావాలి
పక్క రాష్ట్రం వాళ్ళు ఎన్ని నిధులు అడుగుతే అన్ని తీసుకుపోతున్నారు.. తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ కు ఏం నిధులు తెచ్చారో చెప్పాలి
ప్రధాన మంత్రి తో సహా కేంద్ర మంత్రులను మాకు కావాల్సిన అంశాలు అడుగుతుంటే వివక్ష చూపుతున్నారు..
తెలంగాణ ఏర్పాటు పట్ల ప్రధాన మంత్రి గారు అమిత్ షా గారు కోన్ కిస్కా ఎంపీ లు వివక్ష పూరితంగా మాట్లాడుతున్నారు..
ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడ తీర్మానం లో చెప్పారు ఆనాడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు..
మీరు బంగారం కొనవద్దు అని చెప్పడానికి వచ్చారా…? తెలంగాణ అవసరాలకు అనుగుణంగా 8 మంది బిజెపి ఎంపీలు ,ఎమ్మెల్యేలు తెలంగాణ కు కావలసిన అభివృద్ధి అంశాలపై ఒక్క వినతి పత్రం అయిన ఇచ్చారా..
ట్రిపుల్ ఆర్ నిధులు ,మెట్రో నిధులు కావాలి ,రేడియల్ రోడ్లు కావాలని ఏమైనా అడిగారా..?
రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుల గణన జరిగింది..రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని చెప్పం..
ప్రధాన మంత్రి గారికి జన గణన లో కాలం 13 లో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది..జన గణన లో బీసీ ల ఇళ్ల లెక్క చేయాలని మోడీ గారికి చెప్పాం..
జన గణన లో బీసీ కుల గణన చేరచకపోవడాన్ని తెలంగాణ బలహీన వర్గాల గమనించాలి..
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా స్వాగతం పలకడానికి వెళ్తాం అని చెప్పాం.. తెలంగాణ కు కావాల్సిన అంశాలు అడుగుతాము అని చెప్పాం..
శ్రీరాముడి పేరు చెప్పి ఓట్లు అడగం..మీ కన్నా ఎక్కువగా పూజిస్తాం
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు.. 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు ఇలా అనేక హామీలు ఉన్నాయి.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కార్పొరేటర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు.. కుమారుడు పై ఆరోపణలు వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన చెప్పాల్సింది..
కేంద్ర మంత్రి పదవి ఉపయోగించుకొని విచారణ అడ్డుకోవడం చేయద్దు..విచారణకు సహకరించాలి..
విచారణకు సహకరించాలి.. కేంద్ర మంత్రి హోదాలో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదు..
నేను సైబరాబాద్ కమిషనర్ తో మాట్లాడాను విచారణ జరగాలి దోషులకు శిక్ష పడాలి..
ఆ బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఇందులో కుల ప్రస్తావన అవసరం లేదు..
అమ్మాయి కూడా ఒకటే కులం..
తెలంగాణ పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలి..
ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రేమ వివక్ష ఉండదు..
మహిళల పట్ల ఎవరు నిరక్ష్యంగా వ్యవహరించిన బాధ్యత వహించాల్సిందే..
పోలీసులు బాధ్యత విస్మరిస్తే ..వారికి చర్యలు తప్పవు..
ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడడం సరైంది కాదు..
ఒకవైపు సమర్థవంతమైన పాలన ప్రజలు హర్షిస్తున్నారు అని చెప్పుకుంటూనే.. పెట్రోల్ డీజిల్ వడద్దు..
బంగారం కొనవద్దు.. వంట నూనె వాడవద్దు..విదేశాలకు వెళ్ళవద్దు అని దేశ ప్రధాని మాట్లాడడం సరైంది కాదు..
ప్రధాన మంత్రి ఆదర్శంగా ఉండాలి..
ప్రధాన మంత్రి ఇటీవల కరోనా లాంటి పరిస్థితి వచ్చేలా ఉందని ప్రకటన చేయగానే జనాలు భయపడి పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్ లలో ఉన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ ,రాజీవ్ గాంధీ దేశ ఐక్యత. కోసం ప్రాణాలు అర్పించారు..
అలాంటి గాంధీ కుటుంబ సభ్యుడిని మావోవాది ,ముస్లిం లీగ్ అని మాట్లాడడం సరైంది కాదు..
అందరికీ సమాన జీవించే హక్కు ,మాట్లాడే హక్కు కాదని.. విభజించు పాలించు లాగ మాట్లాడుతున్నారు.. శ్రీరామ్ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు..
బీజేపీ తెలంగాణ నాయకత్వం
భద్రాచలం ,కొండగట్టు , వేములవాడ , బాసర ఆలయాల అభివృద్ధి మేము చేస్తున్నాం..
ప్రసాద్ స్కీమ్ కింద ఏ ఆలయాలకు నిధులు తెచ్చారు.
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం..
ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు గోదావరి పుష్కరాలకు 2 వేల కోట్లు కేటాయించాలని ఎందుకు అడగలేదు..
తెలంగాణ లోని దేవాలయాల పై ఎందుకు వివక్ష..
కేంద్ర నాయకులను చూస్తే లాగులు తడుస్తున్నాయా..
బీసీ హక్కుల గురించి అడగరు..దేవాలయాల అభివృద్ధి అడగరు.. క్యూర్ ఏరియా అభివృద్ధి గురించి అడగరు .
అబ్కీ బార్ సర్కార్ అంటున్నారు.. అభివృద్ధి గురించి మాట్లాడరు..
భారత ప్రధాన మంత్రి గా తెలంగాణ కు వస్తె రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే పెద్ద కోడి గుడ్డు సున్నా ఇచ్చిపోయారు.. మీకు తెలంగాణ ప్రజలు దండం అంటున్నారు..








