కారేపల్లి, మహా : సింగరేణి గ్రామంలోని పిల్లలు,యువతలో ఆత్మరక్షణ, క్రమశిక్షణ, శారీరక దఅఢత్వాన్ని పెంపొందించేందుకు ఉచిత కరాటే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సింగరేణి గ్రామ సర్పంచ్ మేదరి వీరప్రతాఫ్(టోనీ) తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ వేసవి సెలవులను దఅష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన బాలబాలికలు, యువతకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కరాటే నేర్చుకోవాలనే ఆసక్తి గల విద్యార్థిని, విద్యార్థులు గ్రామపంచాయతీ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. 6 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న పురుషులు, మహిళలు ఈ శిక్షణలో పాý£్గనవచ్చని తెలిపారు. కరాటే ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలు మెరుగుపడతాయని, ముఖ్యంగా పిల్లలలో ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని సర్పంచ్ టోనీ పేర్కొన్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, సింగరేణి గ్రామస్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు.








