నూతన మండలాధ్యక్షులకు కంది శ్రీనివాస రెడ్డి సత్కారం
ఆదిలాబాద్ : జైనథ్, భోరజ్, బేల మండలాల నూతన అధ్యక్షులుగా గడ్డం జగదీశ్వర్ రెడ్డి ,బత్తుల శ్రీనివాస్, రూప్ రావు లు నియమితులు కావడం సంతోషంగా ఉందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. ఎన్నోఏళ్లుగా వారు ఆయా మండలాలలో పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు.వారి కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. అంతా కలిసి కట్టుగా పని చేసి పార్టీని మరింత బలోపేతంగా తయారు చేస్తామన్నారు.వచ్చే ఎన్నికలేవైనా గెలుపే లక్ష్యంగా ముందడుగు వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు కార్యకర్తలతో పాటు పట్టణ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 6








