రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
గర్భిణీని దవఖానకు తరలిస్తుండగా 108లో ప్రసవించగా తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడ గ్రామానికి చెందిన గర్భిణి సుష్మకు పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే స్పందించి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో శేరిగూడ సమీపంలో అంబులెన్స్ లోనే ప్రసవించగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. అనంతరం వైద్యం కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది ఈఎంటి భాస్కర్, నవీనును స్థానికులు అభినందించారు.
Post Views: 7








