కారేపల్లి, మహా : క్రేన్ వాహనం బోల్తా పడి డ్రైవర్ రాజేష్(40) మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గాంధీనగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం జరిగింది. స్ధానికుతుల తెల్పిన వివరాలు ప్రకారం టేకులపల్లి మండలం తడికలపూడి గ్రామం నుండి ఖమ్మంకు తరలి వెళ్తుండగా గాంధీనగర్ పెట్రోల్ uంక్ సమీపంలో వాహనం టైర్ పేలి పోయింది. దీంతో అదుపుతప్పిన వాహనం బోల్తా పడటంతో డ్రైవర్ రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్ధానికులు వాహనం పై ఉన్న క్రేన్ యాజమాని సిహెచ్. రామకృష్ణ ఫోన్ నెంబర్ కు విషయం తెలిపారు. నెల రోజు క్రితమే కొత్తగూడెంకు చెందిన రాజేష్ ను క్రేన్ డ్రైవర్‌గా నియమించినట్లు ఓనర్ రామకృష్ణ తెలిపారు. దీనికి సంబంధించి కారేపల్లి పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకోని విచారణ చేశారు.
Post Views: 87








