- కారేపల్లి గోదాంవద్ద రైతుల అందోళన
- గోదాం నిండిందని మొక్కజొన్న దింపని అధికారులు
- 200 కిలోమీటర్ల గోదాం కేటాయింపుపై నిరసన
- కారేపల్లిలో అంతా ఆగం ఆగం
- అధికారుల అంతా ఇష్టారాజ్యం
- పట్టించుకోని అధికార పార్టీ నాయకులు
- రైతులకు న్యాయం చేసేది ఎవరు
కారేపల్లి, మహా : కారేపల్లిలో మొక్కజొన్న రైతులు సోమవారం రాత్రి అందోళనకు దిగారు. సోసైటీ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రం ద్వారా ట్రాక్టర్లు, లారీలతో తీసుకవచ్చి మొక్కజొన్న బస్తాలను అప్పాయిగూడెం గోదాంలో దించుకోకుండా తాత్సర్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వే బ్రిడ్జి కాటా వద్ద రోజుల తరబడి వేచిచూస్తున్నామని సోమవారం వచ్చిగోదాం నిండిందని సోసైటీ వారి ద్వారా వేరే ప్రాంతాలకు పంపించుకోవాలని చెప్ప్పుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లిలోని జిన్నింగ్ మిల్లులో స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసిన అధికారులు దానిలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు చెందిన వారి మొక్కజొన్న నిల్వ చేస్తున్నారని ఇక్కడి రైతులు మాత్రం 200 కిలోమీటర్ల దూరంలోని నల్గొండ జిల్లా చిలకమర్రి గోదాంకు పంపుకోవాలని తెల్పటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుండి బస్తాý తరలింపుకు లారీలు రాక పోవటంతో రైతులు లారీలు, ట్రాక్టర్లలను తెప్పించుకోని గోదాంకు వస్తే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మొక్క్పు£న్న కారేపల్లి లోని గోదాంలోని నిల్వ చేసేలా చర్య తీసుకోవాలని డిమాంఢ్ చేశారు. రైతుల అందోళన వద్దకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, బీఆరఎస్ నాయకులు లాకావత్ లక్ష్మన్ రైతులు, అధికారులతో మాట్లాడారు. రైతుల ఆవేదనను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ దృష్టికితేవటంతో అయన స్పందించి మంగళవారం కల్ల కారేపల్లిలోనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకుంటానాని హామీ ఇవ్వటం రైతులు శాంతించారు.








