Mahaa Daily Exclusive

  కొండలన్ని పిండి చేస్తున్న రియల్ మాఫీయా …

Share

కొండలన్ని పిండి చేస్తున్న రియల్ మాఫీయా :
మైనింగ్, పోలీస్ శాఖల నుండి ఎటువంటి అనుమతులు లేకుండానే కొండలన్ని, గుట్టలన్ని రియల్ మాఫీయా పిండి చేస్తోంది. నిషేధిత జెలిటెన్ స్టిక్స్ ను ఉపయోగించి రాత్రుళ్ళు బ్లాస్ట్ చేయటంతో బండ రాళ్లు సైతం పిండైపోతున్నాయి.దీంతో సమీప గ్రామాలు బాంబుల మోతతో దద్దరిలి పోతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ అధికారులు రెండేళ్లుగా మైనింగ్ అనుమతులు ఎవరికీ ఇవ్వలేదని వారు స్పష్టం చేస్తున్నారు. కొండలను పిండి చేయటమే కాకుండా రాళ్ళను, పొలాల సరిహద్దుల కోసం కడీలను తయారు చేసి సూదురా ప్రాంతాలకు తరలించి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.రాళ్లను వేరే ప్రాంతానికి తరలిస్తే వాల్టా చట్టం కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది.. వాల్టా చట్టాన్ని బండరాల్ల కింద బొంద పెట్టి అక్రంగా రాళ్లను తరలించటం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు బహిరంగ చర్చే జరుగుతోంది.మైనింగ్ బ్లాస్టింగ్ వ్యవహారం పోలీసులకు తెలిసిన వారి మౌనం వెనుక అంతరార్ధం ఏంటో చెప్పాలని స్థానికులు నిలదీస్తున్నారు.