Mahaa Daily Exclusive

  సైడ్ డ్రైనేజీ కాలువ పనులను ప్రారంభించిన సర్పంచ్ బుల్లి…

Share

 

కారేపల్లి, మహా:సింగరేణి మండల పరిధిలోని వెంకట్యతండాలో మెయిన్ రోడ్డు సైడ్ డ్రైనేజీ కాలువ పనులను స్థానిక సర్పంచ్ బానోత్ బుల్లి బుధవారం ప్రారంభించారు.కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంఘం నిధులతో 350 మీటర్ల మేర కాలువ పనులను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా విడతల వారీగా పనులను చేపడుతున్నట్లు తెలిపారు.వేసవి రీత్యా నీటి ఎద్దడి లేకుండా ప్రణాళిక సిద్ధం చేసి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బానోతు దేవుల నాయక్,ఉప సర్పంచ్ బానోత్ రమేష్,వార్డు సభ్యురాలు సంగీత,వాంకుడోత్ కిషన్,రవి తదితరులు పాల్గొన్నారు,