Mahaa Daily Exclusive

  ఆలయం కూల్చివేతపై విచారణ చేపట్టిన మున్సిపల్ అధికారులు

Share

చెన్నకేశవ ఆలయాన్ని పరిశీలించిన ఏఎంసి రమేష్
ఆలయాన్ని పునర్మించి న్యాయం చేయాలన్న గ్రామస్తులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
చింతపల్లిగూడెంలోని చెన్నకేశవ స్వామి ఆలయాన్ని కూల్చివేతను, ఆదిభట్ల సర్కిల్ ఏఎంసి రమేష్ పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి, ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని 54 వ డివిజన్, చింతపల్లిగూడ గ్రామంలో పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తూ గ్రామస్థులు జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌లకు వినతిపత్రం అందజేయడము జరిగింది. బుధవారం గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జీహెచ్‌ఎంసీ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని, చింతపల్లిగూడ గ్రామ రెవెన్యూ సర్వే నంబర్లు 9, 10, 11, 12లో గాజులబోడు ప్రాంతంలో సుమారు 100 సంవత్సరాల పై చరిత్ర కలిగిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉండేదని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ ఆలయాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నారని తెలిపారు.
అయితే ఇటీవల ఆ ప్రాంతంలో “ప్రగతి టౌన్ షిప్* పేరుతో వెంచర్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆలయాన్ని కూల్చివేశారని గ్రామస్థులు ఆరోపించారు. తమ ఆరాధ్య దైవంగా భావించే దేవాలయాన్ని తొలగించడం వల్ల గ్రామ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆదిభట్ల మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌కు అందజేసిన ఫిర్యాదుతో, డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎంసి బి ఎన్ కె రమేష్, సంబంధిత అధికారులతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన ఏఎంసి రమేష్ తమ సిబ్బందితో కలిసి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి గ్రామానికి న్యాయం చేయాలని, మున్సిపల్ అధికారులను గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమములో దళిత చైతన్య వేదిక (డీసీవీ) రాష్ట్ర అధ్యక్షులు ఉక్కుల అశోక్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు ఉడుతల రవి గౌడ్, జోగు స్వామి, జోగు జంగయ్య, శేరి రమేష్ తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు.