Mahaa Daily Exclusive

  ఘ‌నంగా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్స‌వం…

Share

ఘ‌నంగా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షికోత్స‌వం

– మ్యారేజ్ బ్యూరో రంగంలో సేవలు అందిస్తున్న వారికి అవార్డులు

▪️ బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘ‌నంగా వేడుక‌లు

హైదరాబాద్‌, మహా : తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జ‌రిగాయి. రవీంద్రభారతి వేదికగా జరిగిన ఈ వేడుకలో మ్యారేజ్ బ్యూరో రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న నిర్వాహకులు, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులు, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తులను ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించారు.
తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ, సామాజిక రంగ ప్రముఖులు హాజరై విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు సంవ‌త్స‌ర‌ కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 1800కు పైగా వివాహాలు విజయవంతంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది.

ఈ వేడుకలో “శ్రీ మహానంది అవార్డు”, “గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు”, “నటరాజ్ అవార్డు”, “మ్యారేజ్ బ్యూరో ఐకాన్ అవార్డు”, “మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు”, “ఉత్తమ సేవారత్న అవార్డు”, “శ్రమశక్తి అవార్డు” వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేశారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ… తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషిస్తున్న సభ్యులందరిని అభినందించారు. మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బుర్ర శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని మ్యారేజ్ బ్యూరోలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారికి వృత్తిపరమైన గౌరవం కల్పించడం, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలవడం తమ లక్ష్యమని తెలిపారు. సభ్యుల ఐక్యత, సేవాభావం, పరస్పర సహకారంతో సంస్థ మరింత బలోపేతమవుతోందన్నారు. మెరుగైన సమాజ నిర్మాణంలో తమ వంతు బాధ్యత విజయవంతంగా నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యుల సమస్యలను ప్రభుత్వం తీర్చాలని కోరారు. ఈ వేడుక‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స‌భ్యులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, గోపా ప్రెసిడెంట్ బండి, సాయన్న. ప్ర‌ముఖ వ్యాపార‌వెత్త‌లు సామ స్వరూప గౌడ్, మామిండ్ల మాధవి, దేవిక, శ్యామ్ రావు , ముదిరాజ్, జగదీష్ పటేల్, అంతటి మహేశ్వరి గౌడ్, ముక్కెర నిర్మల, ఐల రవీందర్ గౌడ్, మధుసూదన్ గౌడ్, మలుగారి శేఖర్ గౌడ్, అసోసియేష‌న్ స‌భ్యులు పాల్గొన్నారు.