Mahaa Daily Exclusive

  నేడు మంచాల మండలానికి ఎమ్మెల్యే రంగారెడ్డి…

Share

  • నేడు మంచాల మండలానికి ఎమ్మెల్యే రంగారెడ్డి
  • పలు ప్రభుత్వ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
  • మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
  • మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం మహా:
మంచాల మండలంలోని గ్రామాల్లో 1కోటి 33 లక్షల నిధులతో, నేడు ఎమ్మెల్యే రంగారెడ్డి పర్యటించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, మంచాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి తెలిపారు. నేడు శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలంలో జాపాల, రంగాపూర్, చిదేడు, ధాత్ పల్లి గ్రామాలలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామాల సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరుకావాలని నరేందర్ రెడ్డి కోరారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ….
సాయంత్రం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం క్యాంపు ఆఫీస్ (ప్రజా భవన్)లో మంచాల మండలంలోని 53 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణి చేస్తారు.