Mahaa Daily Exclusive

  కటకటాల పాలైన కసాయి తండ్రి.!

Share

  • కటకటాల పాలైన కసాయి తండ్రి.!
  • కన్న కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన కసాయి
  • తల్లి ఫిర్యాదుకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు
  • నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

 

ఇబ్రహీంపట్నం మహా:

కన్న కూతురుపై లైంగిక దాడి చేసిన కేసులో కసాయి తండ్రికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించిన ఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అవినాష్ సాహ్ని (42), బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబ‌ట్లలో నివాసం ఉంటున్నాడు. 2023లో ఆయన తన సొంత కూతురు(14) పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు 2023లో తల్లి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి సీఐ రఘువీర్ రెడ్డి, అన్ని సాక్షదారాలు సేకరించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, మరుసటి రోజే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

 

నిందితుడుపై నేరం రుజువుకు సహకరించిన సీఐ…

సీఐ బి.రవి కుమార్, హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, పోలీస్ కానిస్టేబుల్ లింగమయ్య సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరచి, నిందితుడిపై నేరం రుజువు కావడానికి సహకరించారు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన స్పెషల్ సెషన్స్ కోర్టు ఫర్ ట్రయల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ పోక్సో కేసుల న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు. న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.12 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం మంజూరు చేశారు. ఈ కేసులో సమర్థవంతంగా పని చేసిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.