Mahaa Daily Exclusive

  డ్రైనేజీ లీకై రోడ్డుపై పారుతున్న మరుగునీరు…

Share

  • డ్రైనేజీ లీకై రోడ్డుపై పారుతున్న మరుగునీరు…
  • ప్రజా సమస్యలు పట్టించుకోని అధికారులు పాలకులు
  • ఇబ్రహీంపట్నం శివారులో దారిపై పారుతున్న మరుగునీరు
  • తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు ప్రజలు

ఇబ్రహీంపట్నం మహా:
ఇబ్రహీంపట్నం నుండి నాగన్ పల్లి, ఆక్టోపస్ వెళ్లే దారిలో అండర్ డ్రైనేజ్ లీక్ అవుతున్న పట్టించుకునే నాధుడే కరువైండని స్థానికులు వాపోతున్నారు….. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శివారులో డ్రైనేజీ లీక్ అయ్యి రోడ్డుపై ఘోరంగా పారుతున్న మరుగునీరుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు వాహనదారులు….. మున్సిపల్ అధికారులు దీనిపై స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని, స్థానిక ప్రజలు, వాహనదారులు కోరుచున్నారు……

డ్రైనేజీ లీకై రోడ్డుపై పారుతున్న మరుగునీరు…
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో సమస్యలు తీర్చే పరిస్థితి కనబడుటలేదని పలువురు వాపోతున్నారు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రజా సమస్యలు అధికమయ్యాయి. కనీసం అండర్ డ్రైనేజీ లీకేజీలను పట్టించుకోలే నాథుడు లేకపోవడంతో మరుగునీరు రోడ్లపై పారుతూ దుర్వాసన వెదజల్లుతున్నడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

రెండు రహదారులను కలిపి దారి మరుగు నీరుతో స్వాగతం…
నాగార్జునసాగర్ హైవే నుంచి ఇబ్రహీంపట్నం, నాగన్ పల్లి, పోల్కంపల్లి, బాటసింగారం మీదుగా విజయవాడ రహదారికి కలిసి ప్రధాన రోడ్డు కావడంతో తరచూ వాహనాలతో రద్దీగా ఈ రోడ్డు ఉంటుంది. రెండు రహదారులను కలిపే రోడ్డులో డ్రైనేజీ లీకై దారుణంగా మార్గనీరు పాడుతున్న పాలకులు అధికారులు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నెలకొంది. ప్రజా సమస్యలను పరిష్కరించేల చర్యలు తీసుకోవాలని, స్థానిక ప్రజలు మున్సిపాలిటీ అధికారులను కోరుచున్నాను.