Mahaa Daily Exclusive

  ప‌ట్ట‌ణ పేద‌ల‌కు పెద్ద‌న్న‌రేవంత్ రెడ్డి…

Share

  • ప‌ట్ట‌ణ పేద‌ల‌కు పెద్ద‌న్న‌రేవంత్ రెడ్డి
  • తొలి విడ‌త‌గా ల‌క్ష‌, మ‌లి విడ‌త మ‌రో ల‌క్ష ఇళ్ల నిర్మాణం
  • ఏడాదిలోగా ల‌క్ష ఇళ్ల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌
  • పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కు ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు
  • ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు శంకుస్ధాప‌న చేసిన‌ మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ :-ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. త్వ‌ర‌లో క్యూర్ ప‌రిధిలో తొలివిడ‌త‌గా మంజూరు చేసిన ల‌క్ష ఇళ్ల‌కు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాప‌న చేయ‌డ‌మేగాక ఏడాది తిరిగిలోగా వాటి నిర్మాణాలు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లో నిర్మించ‌బోయే ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల స‌ముదాయానికి మంత్రి శనివారం శంకుస్ధాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌లే ప్ర‌జ‌లు ఒక‌చోట ఇళ్లు 30-40 కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉండేలా చేయ‌బోమ‌ని , ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఏ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇళ్లు నిర్మిస్తామ‌ని ఇది పేద‌ల‌కు పెద్ద‌న్న , ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కానుక‌గా అందిస్తామ‌ని అన్నారు.

రాష్ట్రంలో పేద‌వాని గుమ్మం వ‌ద్ద‌కే ప్ర‌జా ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు చేరేలా కృషి చేస్తున్నామ‌న్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, స‌ర్వే త‌దిత‌ర శాఖ‌లు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ఈ స‌మీకృత భ‌వ‌నాల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. తమ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లలో భాగంగా మూడు కార్పొరేష‌న్ల‌ ప‌రిధిలోని 13 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ప్రైవేటు రంగానికి ధీటుగా కార్పొరేట్ త‌ర‌హాలో అందుబాటులోకి తీసుకువ‌స్తున్నామ‌న్నారు. అంతేగాక ప్ర‌భుత్వంపై నిధుల భారం ప‌డ‌కుండా రియ‌ల్ ఎస్టేట్ నిర్మాణ‌ రంగంలో ప్ర‌సిద్ధ‌మైన‌ సంస్ధ‌ల‌కు నిర్మించే బాధ్య‌త అప్ప‌గిస్తున్నామ‌న్నారు. మ‌రి కొద్ది నెల‌ల్లో ఇక్క‌డ ఫినిక్స్ సంస్ధ 30వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ భ‌వ‌నాన్ని పూర్తి చేసి ఇస్తుంద‌ని వెల్ల‌డించారు. బంజారాహిల్స్ స‌మీకృత భ‌వ‌నంలో ఎస్‌.ఆర్. న‌గ‌ర్‌, బంజారాహిల్స్‌, గోల్కోండ స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులు , డిఐజి కార్యాల‌యం, రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ – గోల్కొండ కార్యాల‌యాలు వ‌స్తాయ‌ని వీటివ‌ల‌న ఈ ప్రాంత ప్ర‌జ‌లకు మ‌రిన్ని ఉద్యోగ‌, వ్యాపార సౌక‌ర్యాలు క‌లుగుతాయ‌న్నారు. వందల సంవ‌త్స‌రాలుగా ఈ ప్రాంతంలో న‌మాజ్‌చేసుకుంటున్న ముస్లిం సోద‌రుల‌కు ఏటా రెండు సార్లు న‌మాజు కార్య‌క్ర‌మం నిర్వ‌హించుకునేలా అధికారులను ఆదేశించామ‌ని ప్ర‌క‌టించారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ లతో పాటు స్ధానిక ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌గా ఎంపీ అనీల్ యాద‌వ్‌, ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి రాజీవ్ గాంధీ హ‌నుమంతు త‌దిత‌రులు పాల్గొన్నారు.