- వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.?
- వరద నీది కాలువ నిర్మాణ పనులు పరిశీలన.!
- నాణ్యత లోపించకుండా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి.?
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నాణ్యత లోపించకుండా నిర్దేశిత సమయంలో వరద నీటి కాలువ నిర్మాణ పనులు పూర్తి చేయాలని హయత్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఉమ్మడి హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ నుండి కుమ్మరి కుంట వరకు వరద నీటి కాలువ నిర్మాణ పనులకు సంబంధించి, తన హయంలో మంజూరైన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణానికి అవసరమైన లెవెల్స్, వరద నీటి ప్రవాహ మార్గాలు, నిర్మాణానికి అవసరమైన స్థలం మరియు ఇతర సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వర్షాకాలంలో రాఘవేంద్ర కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా కాలువ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, హయంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంజూరు చేయించిన నిధులతో ఈ కీలకమైన వరద నీటి కాలువ నిర్మాణ పనులు చేపట్టబడుతున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే వర్షపు నీరు సాఫీగా కుమ్మరి కుంట వరకు చేరి కాలనీల్లో నీరు నిల్వ ఉండే సమస్యకు గణనీయమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, కాలనీల అభివృద్ధి మరియు వరద సమస్యల నివారణే లక్ష్యంగా ఈ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ శివకృష్ణ, ఏఈ సాయికృష్ణ గారు, జెఈ బాబురావు, బీజేపీ డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోవింద చారి, నాయకులు ఇట్టబోయిన నర్సింహా, మధు సుధన్ రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..








