కారేపల్లి, మహా: మండల పరిధిలోని బొక్కలతండ స్టేజివద్ద ఉన్న వాకుండోత్ గన్య అనే రైతుకు చెందిన జామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైంది. శక్రవారం గన్యకు చెందిన ఎకరంన్నర జామాయిల్ తోటలోని విద్యుత్ వైర్లు గాలికి చెట్లకు రాసుకుని విద్యుత్ సర్క్యిట్ కావడం తోట మొత్తం మంటలు అల్లుకున్నాయి.ఇది గమనించిన బజ్యతండా సర్పంచ్ వాంకుడోత్ హనుమంతరావు ఇల్లెందు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో ఇల్లెందు నుంచి అగ్నిమాపక సిబ్బంది తోట చుట్టు మంటలను అదుపూ చేసిన కాని తోట మొత్తం దగ్ధమై పోయిందని రైతు ధన్య తెలిపారు. కాగా పంచాయతీ సిబ్బంది గ్రామంలోని వాటర్ ట్యాంకర్ తో నీటిని తీసుక వచ్చి మంటలు లేవకుండా మంటలను ఆర్పుతున్నారు. కాక జామాయిల్ తోట పూర్తిగా కాలిపోయిన గన్యను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆస్తి నష్టం విలువ మూడు లక్షల వరకు ఉంటుందని అంచన వేశారు.
Post Views: 7








