Mahaa Daily Exclusive

  దివ్యాంగ జర్నలిస్టులకు అక్రెడిటేషన్​ కార్డులు ఇవ్వాలి..

Share

  • దివ్యాంగ జర్నలిస్టులకు అక్రెడిటేషన్​ కార్డులు ఇవ్వాలి
  • జిల్లాల్లో అప్లికేషన్లు వెంటనే ఓకే చేయాలి
  • మీడియా అకాడమీ చైర్మన్​కు డీజేఎస్​ మెమోరాండం

హైదరాబాద్, మహా : దివ్యాంగులైన వర్కింగ్​ జర్నలిస్టులందరికీ యాజమాన్యాల కోటాతో సంబంధం లేకుండా అక్రెడిటేషన్​ కార్డులు మంజూరు చేయాలని మీడియా అకడామి చైర్మన్ కె.శ్రీనివాస్​రెడ్డిని డెస్క్​ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) కోరింది. అలాగే కొన్ని జిల్లాల్లో డెస్క్​ జర్నలిస్టుల అక్రెడిటేషన్​ దరకాస్తులను వెంటనే ఆమోదించి కార్డులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం డీజేఎస్​ అధ్యక్షుడు బాదిని ఉపేందర్ ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కార్యవర్గం, పలువురు డెస్క్​ జర్నలిస్టులు ప్రెస్​ అకాడమీ చైర్మన్​ను కలిసి డెస్క్​ జర్నలిస్టు సమస్యలపై మోమోరాండం సమర్పించారు. ఈ సoదర్భంగా దివ్యాంగులైన జర్నలిస్టులకు యాజమాన్యాల కోటాతో సంబంధం లేకుండా ఆక్రెడిటేషన్​ కార్డులు ఇవ్వాలని శ్రీనివాస్​రెడ్డిని కోరారు. అలాగే జిల్లాల్లో డెస్క్​ జర్నలిస్టులు చేసుకున్న దరఖాస్తులను ఆమోదించడంలో డీపీఆర్వోలు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాల్లో డెస్క్​ జర్నలిస్టులకు జిల్లా కేంద్రంగా అదనంగా అక్రెడిటేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను అమలు చేయడంలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని దృష్టికి తీసుకెళ్లారు. 15 ఏండ్ల ఎక్స్​పీరియన్స్​ దాటిన డెస్క్​ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. డీజేఎస్​ చేసిన వినతులపై సానుకూలంగా స్పందించిన శ్రీనివాస్​రెడ్డి దివ్యాంగులైన వర్కింగ్​ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జిల్లాల్లో అక్రెడిటేషన్ల ప్రక్రియలో నెలకొన్న ఆలస్యం, జీవో అమలులో నిర్లక్ష్యంలో ఐఅండ్​ పీఆర్​ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజేఎస్​ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేఎన్​ రాజారామ్​, కనపర్తి రమేశ్​, గుజ్జుల సత్యప్రసాద్. వి, వెంకటరమణ, నరేశ్​ తదితరులు పాల్గొన్నారు.

వినతులు అందజేద్దాం

మంగళవారం హైదరాబాద్​లోని మాసబ్​ ట్యాంక్​లో ఉన్న ఐఅండ్ పీఆర్ కమిషనరేట్లో జరిగే రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ మీటింగ్ కు హాజరయ్యే సభ్యులకు అక్రెడిటేషన్ కార్డులు రాని వారంతా కలిసి ఓ వినతి పత్రం అందజేద్దామని డీజేఎస్ ప్రెసిడెంట్ ఉపేందర్ పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న మిత్రులు మంగళవారం ఉదయం ఐఅండ్ పీఆర్ కమిషనరేట్​ వద్దకు రావాలని కోరారు.