- ఆరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
- సర్పంచులు విజయ వెంకటేష్ శ్రీనివాస్ నాయక్
- దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయిన వాహనాలు
- అతుకులు గతుకులతో తరచూ ప్రమాదాలు
- తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
ఇబ్రహీంపట్నం జూన్ 13 మహా:
ఆరుట్ల నుండి చెన్నారెడ్డిగూడ, బండలేము గ్రామాలకు వెళ్లే రహదారి అతుకులు గతుకులు ఉండడంతో తరచులు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని, ప్రజలు ధర్నా చేపట్టడం జరిగిందని, విజయ వెంకటేష్, శ్రీనివాస్ నాయక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఆరుట్ల నుంచి చెన్నారెడ్డి గూడా బండలేముర్ గ్రామాలకు వెళ్లే రహదారి గుంతల మయమై అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదాల బారిన పడుతున్నారని, ఈ రహదారిలో గతంలో రోడ్డు ప్రమాదం జరిగి వ్యక్తి దుర్మరణం చెందాడని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఇరు గ్రామాల సర్పంచులు పగడాల విజయ వెంకటేష్, పాట్రోత్ శ్రీనివాస్ నాయక్, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చెన్నారెడ్డి కూడా చౌరస్తా వద్ద చేరుకొని ధర్నా చేపట్టడం జరిగింది. దీంతో వాహనాలు దాదాపు రెండు గంటల పాటు నిలపడంతో, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
రెండు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో నిధులు మంజూరై ఉన్న, రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదని అన్నారు స్థానిక ఎమ్మెల్యే గత ఎన్నికలలో రోడ్డు విస్తరణ పనులు చేపడతానని హామీ ఇచ్చి మరిచారని ఆరోపణలు చేశారు. అధికారులు ఎమ్మెల్యే కలెక్టర్ స్పందించి వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రమాదాలను తగ్గించాలని ఎమ్మెల్యేను కోరారు. లేనియెడల జిల్లా కలెక్టరేటును ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని బండలేముర్, చెన్నారెడ్డిగూడ సర్పంచులు విజయ వెంకటేష్ శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు.
బిఆర్ఎస్ నాయకులు బహుదూర్ మాట్లాడుతూ… బండలేముర్ చెన్నారెడ్డి గూడ గ్రామాలకు వెళ్లే రహదారి అతుకులు గతుకులతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఇరు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని, లేదంటే భారీ ఎత్తున కలెక్టరేట్‌ను ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.
బిఎస్పీ నాయకులు వంగల కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రెండు గ్రామాలు అభివృద్ధి నోచుకోలేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అదే జరుగుతుందని ఆయన వాపోయారు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరుట్ల నుంచి చెన్నారెడ్డిగూడ, బండలేమురు గ్రామాలకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట విస్వరించి నేటికీ విస్తరణ పనులు చేపట్టకపోవడంతో ఇరు గ్రామాల ప్రజలు ప్రయాణికులు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వీకే ప్రసాద్ కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో రెండు గ్రామాల ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.








