*”సర్వేపల్లి దోపిడీలో కొత్త కోణం”*
*సర్వేపల్లి నియోజకవర్గం లో ఇరిగేషన్ పనులు చేయకుండానే సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, చేతివాటం ప్రదర్శిస్తూ, దొంగ బిల్లులు దోచుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే!*
*సర్వేపల్లి నియోజకవర్గం లో సోమిరెడ్డి ఆధ్వర్యంలో అవినీత కొత్త పుంతలు తొక్కుతూ, రోజుకో రకంగా బయటపడుతుంది*
*మనుబోలు మండలంలో నీరు వదిలిన కాలువలకు అంచున ఉన్న గడ్డిని తొలగిస్తూ, పూడిక తీయకుండానే ,కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు సోమిరెడ్డి సిద్ధమయ్యాడు*
*సోమిరెడ్డి తూ..తూ.. మంత్రంగా చేస్తున్న పనులను చూసి, రైతులు నివ్వెర పోతున్నారు*
*కాలువల నిండా నీరు ఉన్న సమయంలో ఎవరైనా పూడిక తీత పేరిట కలిబెట్టి వెళ్ళిపోయి, దొంగ బిల్లులు చేసుకునేందుకు, సోమిరెడ్డి ఇంత బరితెగిస్తాడా అంటూ స్థానిక రైతులు వ్యాఖ్యానిస్తున్నారు*
*సోమిరెడ్డి రైతులను అడ్డుపెట్టి దోచుకోవడాన్ని, రైతులు సహించలేకపోతున్నారు*
*ఇరిగేషన్ అధికారులు సోమిరెడ్డి కి వంత పాడుతూ, వాటాలు పంచుకుంటూ పనులు చేయకుండానే దొంగ బిల్లులు చేస్తూ, దొంగలు.. దొంగలు.. ఊళ్ళు పంచుకున్న చందాన, కలిసి దోచుకుంటున్నారు*
*ఇరిగేషన్ అధికారులు ఈరోజు తప్పించుకున్నా, రేపటి రోజు విజిలెన్స్ అధికారులకు, అవినీతి నిరోధక శాఖ అధికారులకు, సమాధానం చెప్పవలసిన రోజు వస్తుందని గుర్తుంచుకుంటే మంచిదని రైతులు హితవు చెబుతున్నారు*
*జిల్లా అధికారులు జోక్యం చేసుకొని సోమిరెడ్డి దోపిడీ నుండి రైతులను కాపాడాలని సర్వేపల్లి రైతాంగం ముక్తకంఠంతో కోరుకుంటున్నారు*
*ఇరిగేషన్ పనులు కాలువలలో నీరు వదలకముందు చేయాలి కానీ, కాలువలలో నీరు వదిలి మొక్కుబడిగా మిషన్లు పెట్టి, చేసినట్టుగా బిల్లు చేసుకోవడాన్ని రైతులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు*
*జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి, సోమిరెడ్డి దోపిడీని అడ్డుకట్ట వేసి, రైతాంగ ప్రయోజనాలను కాపాడాలని రైతులంతా వేడుకుంటున్నారు*








