Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట…

Share

*ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట*

*మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్*

*మహిళా గ్రూపు సభ్యులకు చీరల పంపిణీ*

మహా వరంగల్ బ్యూరో;

వరంగల్ నగరం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో కాశిబుగ్గ లోని నరేంద్ర నగర్ హైస్కూల్లో ఆర్పి లకు, మహిళా గ్రూపు సభ్యులకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండేటి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే ప్రజా ప్రభుత్వం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మాజీ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ గ్రూపు సభ్యుల తో పాటు ఆర్పీ లకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన చీరల కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చే చీరలు ఎంతో నాణ్యతతో కూడిన మెరుగైనవిగా ఉన్నాయని మహిళా గ్రూపు సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోట బాలరాజు, 20వ డివిజన్ ఆర్పీలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.