Mahaa Daily Exclusive

  ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి…

Share

  • ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి…
  • బూత్ లెవెల్ ఏజెంట్లను రాజకీయ పార్టీలు నిర్మించుకోవాలి
  • ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వై శ్రీనివాస్ రెడ్డి
  • సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు

 

ఇబ్రహీంపట్నం జూన్ 18 మహా:

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వై శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో, ఎన్నికల నమోదు అధికారి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో వై. శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యాంశాలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫాం, మ్యాపింగ్ మరియు మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను, తదితర అంశాలపై వివరంగా చర్చించారు. అదేవిధంగా, ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి, వారి ద్వారా ఓటరు జాబితా పరిశీలనలో సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఇఆర్వో శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ యొక్క సమావేశంలో తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేయగా, వాటిని నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తెలిపారు. ఈ సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.