సమస్యలపై సమరం ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఎంజీఆర్..
ఖైరతాబాద్ డివిజన్ ఇంద్రానగర్ బస్తీలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు వాటర్ వర్క్స్ అధికారంతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
గత కొన్ని నెలలుగా ఇంద్ర నగర్ లో వాటర్ సమస్య మరియు పొల్యూషన్ వాటర్ ఉన్నందున ఈరోజు ఉదయం వాటర్ వర్క్స్ అధికారులు మేనేజర్ నాదీమ్ గారు, సెక్షన్ ఆఫీసర్ ఆసిఫ్ గారు మరియు సెక్షన్ ఆఫీసర్ అంజయ్య గారు, లెన్మాన్ రవి గారు తో కలిసి తక్షణమే వాటర్ లైన్ లో పొల్యూషన్ ఎక్కడుందో తెలుసుకొని పని మొదలు పెట్టడం జరిగింది.
అలాగే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వాటరు ప్రెజర్ రావడం లేదని తెలియజేయడం జరిగింది
జిహెచ్ఎంసి ఏఈ భరత్ గారికి ఫోన్లో మాట్లాడి రైన్ వాటర్ మరియు వాటర్ పొల్యూషన్ అయితున్నందున సమస్య తెలుసుకొని ఫోన్లో వివరించడం జరిగింది
తక్షణమే స్పందించిన ఏఈ గారు 42 లక్షల తో రోడ్డు మరియు ఆరు క్యాచ్ ఫిట్ వేస్తానని ఎంజీఆర్ కి హామీ ఇచ్చారు అలాగే జిహెచ్ఎంసి SFA అధికారులకు ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచనలు చేశారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న BRS పార్టీ నాయకులు కార్యకర్తలు ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు గజ్జల ఆనంద్ గారు, శ్యామ్ గౌడ్, శ్రీనివాస్, బాలు యాదవ్, ఈశ్వర చారి, బలరాం, శ్రీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







