Mahaa Daily Exclusive

  భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎంవీఐ వెంకన్న….ప్రభుత్వం అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు హామీ

Share

*భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎంవీఐ వెంకన్నకు నివాళి
కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హామీ*

భూపాలపల్లి రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) వెంకన్న భౌతికకాయానికి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్లి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వెంకన్న భార్యను ఓదార్చిన నాయకులు, ఈ విషాద సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వెంకన్న సేవలను వారు స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.