*మీడియా మిత్రులకు ఆహ్వానం*
ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో అలుపెరగని ప్రయాణం సాగిస్తూ, 77 వసంతాలను పూర్తి చేసుకున్న భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి విశిష్ట జీవన ప్రస్థానాన్ని స్మరించుకుంటూ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సీనియర్ పాత్రికేయులు శ్రీ మాశర్మ రచించిన “వెంకయ్య ‘నాయకుడు’ (ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు)” అనే తెలుగు పుస్తకం ఈ సందర్భంగా ఆవిష్కృతం కానుంది.
*ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం జూన్ 23, 2026 (మంగళవారం) సాయంత్రం గం॥ 5.00 ని॥లకు హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 51 లోని ‘జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్’ (మొదటి అంతస్తు) లో జరగనుంది.* జి.ఎం.ఆర్. గ్రూపు ఛైర్మన్ శ్రీ గ్రంథి మల్లికార్జున రావు గారి అధ్యక్షతన జరగనున్న ఈ సభకు దేశ, రాష్ట్ర రాజకీయ మరియు క్రీడా, సాంకేతిక రంగ ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు.
*హాజరవుతున్న ఆత్మీయ అతిథులు:*
* శ్రీ కంభంపాటి హరిబాబు గారు (గౌరవ గవర్నర్, ఒడిశా)
* శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు (గౌరవ గవర్నర్, త్రిపుర)
* శ్రీ బండారు దత్తాత్రేయ గారు (పూర్వ గవర్నర్)
* శ్రీ జి. కిషన్ రెడ్డి గారు (కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రివర్యులు)
* శ్రీ కె. రామ్మోహన్ నాయుడు గారు (కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు)
* శ్రీ బండి సంజయ్ కుమార్ గారు (కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు)
* శ్రీ శ్రీనివాస వర్మ గారు (కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రివర్యులు)
* శ్రీ వై. సత్యకుమార్ గారు (ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు)
* శ్రీ పుల్లెల గోపీచంద్ గారు (జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్)
* శ్రీ జి. సతీష్ రెడ్డి గారు (డీఆర్డీఓ పూర్వ ఛైర్మన్)
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం.
Post Views: 6







