Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ ప్రేమనగర్‌లో ‘సమస్యలపై సమరం’: కాలనీవాసుల కష్టాలు తెలుసుకుని, అధికారులను ఆదేశించిన బిఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)

Share

ఖైరతాబాద్ నియోజకవర్గ బంజారాహిల్స్ డివిజన్ ప్రేమనగర్‌లో సమస్యలపై సమరంలో భాగంగా ఈరోజు ఉదయం పర్యటించిన ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు కాలనీవాసుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

ప్రేమనగర్‌లో తీవ్రమైన తాగునీటి సమస్య, సాయిబాబా టెంపుల్ బ్యాక్‌సైడ్ ప్రాంతంలో కాలుష్యమైన నీరు రావడం, అలాగే సమయానికి నీరు సరఫరా కాక మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ MGR గారికి వివరించారు .

వెంటనే స్పందించిన MGR గారు వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి గారితో ఫోన్‌లో మాట్లాడి, గత సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

అలాగే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాల విషయంపై మరియు విధి దీపాలకు వెలగక పోవడంతో సంబంధిత ఎలక్ట్రికల్ AE గారితో మాట్లాడి, పాత ఐరన్ స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం శ్రీలంక బస్తీలో GHMC క్యాచ్‌పిట్స్ శుభ్రపరచకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని, వెంటనే GHMC సే విజయ్ కుమార్ గారు మరియు AE మోహన్ రావు గారితో మాట్లాడి సిబ్బందిని పంపించి తక్షణమే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రావుల విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ యాదవ్, నవీన్, నాగరాజు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.