చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ రేపు ఒకే వేదికపై.. నేడు తెలంగాణ సీఎం కీలక సమీక్ష
• తుంగభద్ర, ఆర్డీఎస్ అంశాలపై జలసౌధలో సాయంత్రం 5 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం
• సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
• రేపటి తుంగభద్ర సమావేశం, డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై చర్చ
• కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొననున్న కార్యక్రమంపై సమీక్ష
• ఆర్డీఎస్ ఆధునికీకరణ అంశాన్ని ప్రస్తావించనున్న తెలంగాణ
• తెలంగాణకు రావాల్సిన 15.9 టీఎంసీల నీరు పూర్తిగా అందలేదన్న అంశంపై చర్చ
• కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలపై సమీక్ష
• కర్ణాటకతో లేవనెత్తాల్సిన అంశాలపై ఫోకస్
• రేపటి కీలక సమావేశానికి ముందు తెలంగాణ వైఖరిని ఖరారు చేయనున్న ప్రభుత్వం
Post Views: 4








