Mahaa Daily Exclusive

  సీఎం రేవంత్ రెడ్డితో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా భేటీ….

Share

సీఎం రేవంత్ రెడ్డితో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా భేటీ.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక సమావేశంలో మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాతో పాటు ఆయన సతీమణి డాక్టర్ మెహతాబ్ చండీ ఎ. సంగ్మా కూడా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
వీరితో పాటు మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు శ్రీ స్నియావ్ భలాంగ్ ధర్, శ్రీ ప్రెస్టోన్ టిన్సాంగ్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, తన సతీమణి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో కలిసి ఏకకాలంలో మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయ, అధికారిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.