Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కారమే MGR లక్ష్యం….

Share

ప్రజా సమస్యల పరిష్కారమే MGR లక్ష్యం

ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్‌లో సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం గాంధీ తాత నగర్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పర్యటించారు.

గాంధీ తాత నగర్‌లో నిరంతరాయంగా కొనసాగుతున్న నీటి సమస్య, వాటర్‌లో పొల్యూషన్ మరియు సమయపాలన లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు, యువకులు పెద్ద ఎత్తున MGR గారిని కలిసి తమ సమస్యలను వివరించారు.

వెంటనే స్పందించిన MGR గారు వాటర్ వర్క్స్ మేనేజర్‌కు ఫోన్ చేసి అక్కడికే పిలిపించి, మేనేజర్ మరియు లైన్‌మన్‌తో కలిసి ప్రత్యక్షంగా ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే నీటిలో పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించి, ఇకపై కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ప్రాంతంలోని స్ట్రీట్ లైట్స్ సమస్యపై కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి, వెంటనే మరమ్మతులు చేయాలని, అవసరమైతే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సమస్య తెలిసిన వెంటనే స్పందించే నాయకుడు… ప్రజల మధ్యే ఉండే నాయకుడు… మన MGR గారు!