Mahaa Daily Exclusive

  ముకునూరు రైతు వేదికలో విత్తన మేళ….

Share

  • ముకునూరు రైతు వేదికలో విత్తన మేళ..
  • మంచి దిగుబడి నిచ్చే పంటలు వేసుకోవాలి
  • ముకునూరు గ్రామ సర్పంచ్ శిల్పప్రేమాకర్
  • విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసిన గ్రామ రైతులు

ఇబ్రహీంపట్నం జూన్ 25 మహా:
వ్యవసాయ అధికారుల సలహా సూచనల మేరకు మంచి దిగుబడి నిచ్చే పంటలు వేసుకోవాలని, ముకునూరు సర్పంచ్ శిల్పప్రేమాకర్ రైతులకు సూచించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం, ముకునూర్ రైతు వేదికలో ఏర్పాటుచేసిన విత్తన మేళను, ముకునూర్ సర్పంచ్ సన్నాయిల శిల్ప ప్రేమాకర్, ఏఈఓ సృజన ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి సన్న స్వల్పకాలిక రకాలయినటువంటి RNR-15048, తెలంగాణ సోనా, KNM-1638, జైశ్రీరామ్, అదేవిధంగా,జొన్న, పప్పు దినుసులు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా నానో డీఏపీ వంటి ఎరువులను ప్రోత్సహించే ఉద్ధేశంతో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ శిల్ప మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పలు రకాల విత్తనాల పై రైతులకు అవగాహన కల్పించి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టిందని, తక్కువ కాల పరిమితి మరియు బెట్టను తట్టుకునే రకాలు వాడాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహా సూచనలు తీసుకొని మంచి దిగుబడి నిచ్చే రకాలను తీసుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. పలువురు రైతులు పాల్గొని స్వల్ప కాలీక రకం KNM1638, RNR 15048 వరి విత్తనాలు, నానో యూరియా, పచ్చ జొన్న (PSPY 2) విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.