Mahaa Daily Exclusive

  కొత్త సీఎస్ నియామకం నేపథ్యంలో…

Share

  • కొత్త సీఎస్ నియామకం నేపథ్యంలో
  • 13 మంది ఐఎఎస్ లకు స్థానచలనం
  • సీఎంవోలోకి శ్రీధర్

హైదరాబాద్‌, మహా : తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్‌ సలహాదారుగా ప్రస్తుత సీఎస్‌ కె.రామకృష్ణరావును నియమించింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు ఇచ్చింది. సబ్యసాచి ఘోష్‌కు హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించింది. శైలజా రామయ్యర్‌కు ఈఎఫ్‌ఎస్‌ అండ్‌ టీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అహ్మద్ నదీమ్‌కు పొలిటికల్ (జీఏడీ) ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. ఎన్‌ శ్రీధర్ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా, రాహుల్ బోజ్జాకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఎం.రఘునందన్ రావుకు మైన్స్ అండ్‌ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. అజిత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా బదిలీ చేసింది. పి. కాత్యాయని దేవి హ్యాండ్లూమ్స్ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్స్ స్పెషల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం.. కె. గంగాధర్ ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. టి. వెంకన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. కె. విద్యాసాగర్ టూరిజం డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.