Mahaa Daily Exclusive

  తగ్గేదేలే..! ఈసీపై కవిత ఆగ్రహం..

Share

  • కొత్త పేరు ఇచ్చేది లేదని స్పష్టం
  • న్యాయపోరాటం చేస్తానని ప్రకటన
  • టీఆర్ఎస్ పేరుపై పలువురు ఈసీకి అభ్యంతరాలు వ్యక్తం చేసిన పలువురు
  • పేరు మార్చుకోవాల్సిందేనంటున్న ఈసీ

హైదరాబాద్, మహా : జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం టీఆర్‌ఎస్ పార్టీ పెట్టుకునేందుకు అంగీకరించడం లేదు. కచ్చితంగా పేరు మార్చాల్సిందేనంటూ కవితకు లేఖ రాశారు. పదిహేను రోజుల్లో మూడు ప్రత్యామ్నాయాలు ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేశారు. లేకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ ఆటోమేటిక్‌గా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రద్దు చేస్తామని తేల్చేశారు. దీనిపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు.

 

తెలంగాణ రక్షణ సేన పార్టీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తి చూపిన రెండు అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామని కవిత ప్రకటించారు. ఎన్నికల సంఘం ఒత్తిడి చేస్తున్నట్టు ప్రత్యామ్నాయాలు ఇవ్వోమని వెల్లడించారు. తన పార్టీ పేరు విషయంలో కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. కవిత ప్రకటనతో ఈ వివాదంలో మరో మలుపు తిరిగింది. ఇప్పటికే తన పార్టీ విషయంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన కవిత, ఇప్పుడు మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

 

మొదటి నుంచి అభ్యంతరాలు

 

కవిత పార్టీ ఏర్పాటు మొదటి రోజు నుంచి కూడా వివాదాల చుట్టే తిరుగుతోంది. ఏప్రిల్ 25న కవిత తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. దీనికి అసోసియేషన్ పేర్కొనడంతోనే ప్రత్యర్థులు అనేక రకాలుగా విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌గా పేర్కొన్న ఈ పార్టీకి ఈసీలో గుర్తింపు రాలేదు. తెలంగాణ రక్షణ సేనగా మార్చుకుంటే గుర్తింపు లభిస్తుందన్న సలహా మేరకు రోజుల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్ర సేన కాస్త తెలంగాణ రక్షణ సేనగా మారింది. అయినా దీని సంక్షిప్త రూపం టీఆర్‌ఎస్ ఉన్నందున ఆమె నుంచి అప్పట్లో పెద్దగా అభ్యంతరాలు రాలేదు.

 

పార్టీ ఏర్పాటు నుంచి సమస్యలే

 

తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి పేర్లను కూడా గతంలో కవిత పరిశీలించారు. అయితే ప్రజల్లోకి బాగా వెళ్లిన టీఆర్‌ఎస్ పేరుకి కలిసి వచ్చేలా తెలంగాణ రక్షణ సేనను ఫైనల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయడానికి ఈసీ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇలా పార్టీలు రిజిస్ట్రేషన్ చేసే ముందు దరఖాస్తుదారు తరఫున పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఎవరైనా అభ్యంతరాలు చెబితే ఎన్నికల సంఘం పరిశీలించి పార్టీ ఏర్పాటు చేయబోయే వారి నుంచి క్లారిఫికేషన్ అడుగుతుంది. అయితే మొదటి నుంచి వివాదంగా మారిన టీఆర్‌ఎస్ కలిసి వచ్చేలా ఏర్పాటు చేసిన పార్టీలపైనే అభ్యంతరాలు వస్తున్నాయి. అందుకే మరో మూడు ప్రత్యామ్నాయాలు చెప్పాలని ఈసీ సూచించింది. ఇప్పటికే తండ్రిని ఎదురించి పార్టీ పెడుతున్న కవిత వైపు నిలబడేందుకు పెద్ద నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బాగా పరిచయం అయిన టీఆర్ఎస్‌ పార్టీగా ప్రజల్లోకి వెళ్దామనే ప్లాన్‌కి ఈసీ చెక్ పెట్టేలా ఉంది. దీంతో ఆమె అనుచరుల్లో ఆందోళన మొదలైంది. ఆమె మాత్రం న్యాయపోరాటం చేస్తామని, విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు.

Latest