జలమండలి అధికారులకు వినతిపత్రం ద్వారా సమస్యలు తెలియజేసిన MGR గారు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజులుగా వివిధ డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నీరు సరిగా రాకపోవడం, కలుషిత నీరు రావడం, సమయానికి సరఫరా లేకపోవడం వల్ల ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రధానంగా ఖైరతాబాద్ డివిజన్ ఆంధ్ర గల్లీ, ఇంద్రానగర్, న్యూ CID క్వార్టర్స్, అలాగే బంజారాహిల్స్ రోడ్ నం.12 ప్రాంతాల్లో కొత్త పైప్‌లైన్ అవసరం మరియు నీటి సమస్యలపై జలమండలి GM ప్రభాకర్ రావు గారితో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా స్పందించిన GM ప్రభాకర్ రావు గారు తక్షణమే సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్కడ సమస్య ఉందో అక్కడ స్వయంగా వెళ్లి పరిశీలించి, శాశ్వత పరిష్కారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షులు గజ్జల ఆనంద్ గారు, ఫిలింనగర్ డివిజన్ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్ గారు, శ్యామ్ గౌడ్ గారు తదితరులు పాల్గొన్నారు.








