- దేశమంతా తెలంగాణ రోడ్లవైపు చూసేలా అభివృద్ధి …
- ఇబ్రహీంపట్నం ప్రజలతో నాకు ప్రత్యేక అనుబంధం…
- ఆ అనుబంధంతోనే రూ.338కోట్లతో రహదారుల నిర్మాణం…
- మరోసారి అవకాశం కల్పిస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి….
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి….
- వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు, మంత్రి వెంకన్న సహకారం….
- సీఎం రేవంత్ నాయకత్వంలో నియోజకవర్గం రూపురేఖలు మార్చుతా….
- నాడు ప్రజలకు మాటిచ్చా… నేడు చేసి చూపిస్తున్నా….
- ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి….
- 149కి.మీ. మేర 14 హ్యామ్ ఫోర్ లేన్ రహదారులకు శంకుస్థాపన…
- తొర్రూర్ లో శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి…
- పాల్గొన్న ఎంపీలు , ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు…
ఇబ్రహీంపట్నం జూలై 7 మహా:
దేశమంతా తెలంగాణ రోడ్లవైపు చూసేలా అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించి, ప్రజలకు అంకితమిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో 34 ప్యాకేజీల్లో 6,092 కి.మీ పొడవున 441 హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. రూ.338 కోట్లతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో 149 కి.మీ మేర 14 ఆధునిక హ్యామ్ (HAM) ఫోర్ లేన్ రహదారుల నిర్మాణ పనులకు తొర్రూర్ లో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, శంకర్ నాయక్, రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఇతర శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు మునగనూర్ వద్ద మంత్రి కోమటి రెడ్డికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మల్ రెడ్డి… తొర్రూర్ వరకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రోడ్ షో నిర్వహించారు. శంకుస్థాపన అనంతరం, తొర్రూర్ లో జరిగిన సభలో వారు మాట్లాడారు.
దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర రహదారి వ్యవస్థః మంత్రి కోమటిరెడ్డి…..
ఈ ప్రాజెక్టుల ద్వారా తుర్కయాంజాల్, తొర్రూర్, పెద్ద అంబర్పేట్, కుంట్లూరు, హయత్‌నగర్ తదితర ప్రాంతాలకు ఆధునిక సెంట్రల్ లైటింగ్‌తో కూడిన నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రమాదాలు తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. అదే సమయంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి ఈ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో 34 ప్యాకేజీల్లో 6,092 కి.మీ పొడవున 441 హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిచే రహదారి వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి…. దేశం మొత్తం తెలంగాణ రోడ్ల అభివృద్ధి వైపు చూసేలా అత్యుత్తమ ప్రమాణాలతో రహదారులను నిర్మించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. గతంలో ఎంపీగా తన గెలుపు ఇబ్రహీంపట్నం ప్రజల మద్దతే కీలకమని, తనకు ఇక్కడి ప్రజలతో ఉన్న ప్రత్యేక అనుబంధమే ఈ స్థాయిలో రోడ్ల నిర్మాణానికి కారణమని చెప్పారు. మరోసారి అవకాశం కల్పిస్తే సంపూర్ణ అభివృద్ధి సాధిస్తామని చెప్పారు.
వారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే… మేము భవిష్యత్ కు బాటలు వేస్తున్నాం.. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి……
వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు, మంత్రి వెంకన్న సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇబ్రహీంపట్నం రూపురేఖలు పూర్తిగా మార్చివేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట మేరకే… నేడు అభివృద్ధిని చేసి చూపిస్తున్నట్లు తెలిపారు. గత భారాస ప్రభుత్వం ఫార్మా ఏర్పాటుతో ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే, తామొచ్చాక భవిష్యత్ కు బాటలు వేసేలా ఫ్యూచర్ సిటీ, అంతర్జాతీయ సమీకృత మార్కెట్, ఆరుట్ల మోడల్ స్కూల్ లాంటి వాటితో ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ప్రపంచపటంలో నిలుపుతున్నామ్నారు.
వెంకటేశ్వర స్వామి అభిషేకానందాలయం వద్ద ప్రత్యేక పూజలు…….
మంత్రి రాకకు ముందు మల్ రెడ్డి రంగారెడ్డి గారి స్వగ్రామంలో రూపుదిద్దుకుంటున్న శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకానందాలయాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, శంకర్ నాయక్, తదితర నేతలు సందర్శించారు. రాజగోపురం లోపల చిత్రకంఠ స్తంభాల స్థాపనలో వారు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TUFIDC) చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఈసీ శేఖర్ మామ, కొషికే ఐలయ్య, కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, మరి నిరంజన్ రెడ్డి, కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, భూపతిగళ్ల మహిపాల్, సిహెచ్ భాస్కరాచారి, ముత్యాల రాజశేఖర్ రావు, గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, రమాకాంత్ రెడ్డి, కాకుమాను సునీల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







