Mahaa Daily Exclusive

  ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ భూకబ్జాల‌పై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోండి.. క‌లెక్ట‌ర్ , ఎస్పీల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ఫిర్యాదు..

Share

  •  క‌లెక్ట‌ర్ , ఎస్పీల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి ఫిర్యాదు
  • అసైండ్ స్థ‌లంలో 5 కోట్ల విలువైన 11 ప్లాట్ల‌ను భార్య పేరు పై అక్ర‌మ రిజిస్ట్రేష‌న్
  • కంది శ్రీ‌నివాస రెడ్డి లేఖ‌తో పాటు ఆధారాల‌ను అందించిన కాంగ్రెస్ శ్రేణులు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో భూ కబ్జాలకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఒక లేఖ ద్వారా కలెక్టర్ ఎస్పీని కోరారు. బుధ‌వారం ఆత్మ చైర్మ‌న్ గిమ్మ సంతోష్ రావుతో పాటు ప‌లువురు కౌన్సిల‌ర్లు కాంగ్రెస్ నాయ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్ రాజ‌ర్షి షా, ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ ల‌ను క‌లిసి ఫిర్యాదు చేసారు.
ఆదిలాబాద్ పట్టణంలోని బట్టి సావ‌ర్ గామ్ శివారులో గల సర్వేనెంబర్ 72/3 అసైన్డ్ భూమిలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన భార్య పాయ‌ల్ ఉమ పేరు మీద 5 కోట్ల విలువైన 11 ప్లాట్ల‌ను ఎన్వోసీ ర‌ద్దు చేసి అక్రమంగా రిజిస్ట్రేష‌న్ చేయించార‌న్నారు. ఇదే విషయమై ఈనెల 7న మంగ‌ళ‌వారం ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక లో శ్రీమతికి ప్లాట్ల బహుమతి పేరుతో కథనం కూడా ప్రచురితమైందన్నారు. ఈ ప్లాట్ లకు సంబంధించిన అక్రమ రిజిస్ట్రేషన్ ల డాక్యుమెంట్ ల‌ను సైతం ఫిర్యాదు తో జ‌త చేసామ‌న్నారు. వెంట‌నే ఈ భూక‌బ్జా పై ద‌ర్యాప్తు జ‌రిపించి వెంట‌నే చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.అలాగే అట్టి రిజిస్ట్రేష‌న్ ను క్యాన్సిల్ చేయాల‌ని కోరారు. అలాగే 72/3 స‌ర్వేనంబ‌ర్ లో నూత‌న క‌లెక్ట‌ర్ భ‌వ‌న స‌ముదాయానికి కేటాయించిన స్థ‌లంలో కొంద‌రు క‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని దీనిపై క‌లెక్ట‌ర్ ద‌ర్యాప్తు జ‌రిపించి కబ్జాకు గురైన స్థ‌లాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని కోరారు. ఇదే విష‌యాన్ని కంది శ్రీ‌నివాస రెడ్డి ..సీయం రేవంత్ రెడ్డి , ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస రెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్ల‌నున్నార‌ని తెలిపారు. క‌బ్జాల‌పై చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే కంది శ్రీ‌నివాస రెడ్డి నేతృత్వంలో క‌లెక్ట‌రేట్ ఎదుట పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌డ‌తామ‌ని అన్నారు. క‌లెక్ట‌ర్ ఎస్పీని క‌ల‌సిన‌వారిలో కాంగ్రెస్ మున్సిప‌ల్ ఫ్లోర్ లీడ‌ర్ ఇజ్జ‌గిరి సంజ‌య్, కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ఖిజ‌ర్ పాషా, కౌన్సిల‌ర్లు తుమ్మ‌ల అన్న‌పూర్ణ , మ‌హ‌బూబ్, నాయ‌కులు బండారి స‌తీష్ ,శాంత‌న్ రావు , రాషీద్,మంచాల మ‌ల్ల‌య్య ,మంగేష్ ,అర్బాజ్, గొర్ల రాము యాద‌వ్, బూర్ల శంక‌ర‌య్య‌, ప‌ర్వేజ్, అశోక్, అల్చెట్టి నాగ‌న్న , గుడిప‌ల్లి న‌గేష్ , ద‌ర్శ‌నాల అశోక్, డేరా కృష్ణా రెడ్డి త‌దిత‌రుల‌న్నారు.