Mahaa Daily Exclusive

  ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్ HP గ్యాస్ లైన్ జాఫర్ అలీ బాగ్ “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రోహిత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు…

Share

ఖైరతాబాద్ నియోజకవర్గంలో సోమాజిగూడ డివిజన్ HP గ్యాస్ లైన్ జాఫర్ అలీ బాగ్ “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రోహిత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

 

పాదయాత్ర సందర్భంగా బస్తీ ప్రజలు తాగునీటి సరఫరా తీవ్ర ఇబ్బందులను MGR గారి దృష్టికి తీసుకువచ్చారు.

 

సమయానికి నీరు రావడం లేదని, మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని, అదీ తక్కువ ప్రెషర్ తో వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అలాగే బస్తీలో స్ట్రీట్ లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.

 

ప్రజల సమస్యలపై వెంటనే స్పందించిన MGR గారు వాటర్ వర్క్స్ మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన మేనేజర్ గారు లైన్‌మెన్ ద్వారా వెంటనే సమాచారం ఇచ్చి, గతంలో ఉన్న సమయానికే తగిన ప్రెజర్ తో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

 

అనంతరం నిర్వహించిన SIR (Special Intensive Revision) కార్యక్రమంలో పాల్గొన్న MGR గారు, బస్తీలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని BLO రాము, BLA అజయ్లకు ఫారమ్‌లు అందజేసి సూచనలు చేశారు.

 

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు, మాజీ గ్రంథాలయ చైర్మన్ ప్రసన్న కుమారి రామూర్తి గారు, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, బిట్ల శ్రీనివాసరాజు గారు, ఎండి నుమాన్ గారు తదితరులు పాల్గొన్నారు.

Latest