ఖైరతాబాద్ నియోజకవర్గం ఫిలింనగర్ డివిజన్‌లో “సమస్యలపై సమరం” కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్, బాలిరెడ్డి నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బస్తీ ప్రజలు స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, కొత్త రోడ్లు వేయాల్సిన అవసరం వంటి సమస్యలను MGR గారి దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం వినాయక్ నగర్ BLO సైదులు గారు, బాలిరెడ్డి నగర్ BLO యాదయ్య గార్లతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తూ “నా ఓటు – నా బాధ్యత” అనే సందేశాన్ని ప్రజలకు వివరించి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ పాదయాత్రలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, నరసింహ, సుజాత, భాగ్యమ్మ, శ్రీనివాస్ రెడ్డి, రాజు, గురిగాడు, ప్రభాకర్, శేఖర్, సంతోష్, సుదీర్, శ్రీకాంత్, కార్తీక్, రమేష్, సునీల్, చింటూ, మోహన్, ఆకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.








