Mahaa Daily Exclusive

  పోలీసుల వలలో అంతర్ రాష్ట్ర దొంగ…

Share

*పోలీసుల వలలో అంతర్ రాష్ట్ర దొంగ*

*చాకచక్యంతో దొంగతనం కేసును ఛేదించిన గీసుగొండ పోలీసులు*

*నిందితుడి అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం*

వరంగల్ క్రైం;

 

వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్‌పాక గ్రామ సమీపంలో 10 7 2026 తేదీ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులను గమనించి ట్రాన్స్‌ఫార్మర్ వెనుక దాక్కోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో అతను నందిపాటి జార్జ్ అలియాస్ రమణయ్య (64), పుట్టిపల్లి గ్రామం, కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ కు చెందినవాడని వెల్లడించాడు. వరంగల్ నగరంలోని ఆదర్శ్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిని అర్ధరాత్రి సమయంలో లక్ష్యంగా చేసుకుని, ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపాడు.

నిందితుడి వద్ద నుంచి సుమారు 1 గ్రాము బంగారు ఉంగరం తో పాటు సుమారు 50 గ్రాముల వెండి కాళ్లపట్టీలు (ఒక జత) ను పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడిని అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు పూర్తి చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు గీసుగొండ ఇన్స్పెక్టర్ డి విశ్వేశ్వర్ తెలిపారు.

Latest