*విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్*
*కాంగ్రెస్ వీధి రాజకీయాలు మానుకోవాలి*
*బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు*
*విద్యార్థుల కోసం కాదు, కాక్రోచ్ పార్టీకి పోటీగా కాంగ్రెస్ నిరసనలు*
హనుమకొండ, మహా;
తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ధర్నాలలో పాల్గొనడం సిగ్గుచేటు అని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా కాంగ్రెస్ పార్టీ వి పచ్చి అవకాశవాద రాజకీయాలు అని విద్యార్థులను విద్యార్థి సంఘాలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ విధ్వంసాలు.. రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయమా ? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం కాంగ్రెస్ శ్రేణులు భారత ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడానికి తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా
కాంగ్రెస్ అరాచకాల పై బీజేపీ పోరాటం ఆగదన్న బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
కాంగ్రెస్ పార్టీ తీరుకు నిరసనగా హన్మకొండ అశోక సిగ్నల్ వద్ద బీజేపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
12 వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని తెలంగాణ విద్యార్థులు అరిగోసపడుతున్న పట్టించుకోని మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడటం విడ్డూరం అని అన్నారు. ఇప్పటికైనా
కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆపి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని
విద్యార్థుల నిరసనల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధ్వంసాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు అరాచక మూకల్లా ప్రవర్తించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఒకవైపు దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం ముసుగులో విధ్వంసాలు సృష్టిస్తూ, మరోవైపు రాష్ట్రంలో మాత్రం పోలీసుల అండతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం కాంగ్రెస్ పార్టీ నియంతృత్వానికి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఇటువంటి అప్రజాస్వామిక, అరాచక విధానాల పై భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు మండల్ డివిజనల్ అధ్యక్షులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








